అసిఫాబాద్: ఆసిఫాబాద్ పిటిజి బాలుర గురుకుల పాఠశాల వసతి గృహంలో చన్నీటితో స్నానాలు చేస్తున్న విద్యార్థులు
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని పిటిజి బాలుర గురుకుల పాఠశాల వసతి గృహాల విద్యార్థులకు చన్నీటితో స్నానాలు తప్పడం లేదు. ఆయా వసతి గృహాలలో లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన సోలార్ హీటర్లు పనిచేయకపోవడంతో ట్యాంకులను ఆశ్రయిస్తూ విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతుండగా సకాలంలో తరగతులకు హాజరుకావాలనే ఉద్దేశంతో ఉదయం గడ్డకట్టుకుపోయే చలిలో స్నానాలు చేస్తూ అనారోగ్యం బారిన పడుతున్నారు. ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వేడినీరు అందేలా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు.