అసిఫాబాద్: ప్రభుత్వం జీవో- 3ను పునరుద్ధరించాలి:TAGS జిల్లా కార్యదర్శి నైతం రాజు
ప్రభుత్వం జీవో- 3ను పునరుద్ధరించి గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ నియామకాలు శతశాతం గిరిజనులకే కేటాయించాలని TAGS జిల్లా కార్యదర్శి నైతం రాజు డిమాండ్ చేశారు. సోమవారం ASF కలెక్టర్ కు వినతి పత్రం అందజేసి మాట్లాడారు.. మెగా డీఎస్సీ నుంచి ఏజెన్సీ టీచర్ల పోస్టులను మినహాయించి శతశాతం ఉద్యోగాలు ఆదివాసులకే కేటాయించాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మేగా డీఎస్సీ మినహాయించి, గిరిజనులకు స్పెషల్ డీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ వేసి శతశాతం గిరిజనులకు కేటాయించాలన్నారు.