పిచ్చాటూరులో టిడిపి సర్వసభ్య సమావేశం లో నియోజకవర్గ ఎమ్మెల్యే అనుచరుల వాగ్వాదం
పిచ్చాటూరు టీడీపీ మీటింగ్లో వాగ్వాదం పిచ్చాటూరులోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో టీడీపీ సత్యవేడు నియోజకవర్గ సర్వసభ్య సమావేశం మంగళవారం జరిగింది. పార్టీ అబ్జర్వర్లు తమ ప్రసంగం తర్వాత.. 'ఇప్పుడు కోఆర్డినేటర్, సత్యవేడు ఇన్ఛార్జ్ శంకర్ రెడ్డి మాట్లాడుతారు' అని చెప్పడంతో గొడవ మొదలైంది. ఇన్ఛార్జ్ కానీ వ్యక్తిని అలా ఎలా పిలుస్తారని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అనుచరులు వాగ్వాదానికి దిగారు. తర్వాత అబ్జర్వర్లు మాట్లాడి గొడవను సర్దుబాటు చేశారు.