దర్శి: సోమవరపాడు పాముల కాలనీలో మత్తు రహిత సమాజాన్ని నిర్మించుకోవాలని భారీ ఎత్తున ర్యాలీ చేసిన డిఎస్పి లక్ష్మీనారాయణ
ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం సోమవరపాడు పాముల కాలనీలో డీఎస్పీ లక్ష్మీనారాయణ అధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. అనంతరం మత్తురహిత సమాజాన్ని నిర్మించుకోవాలని భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి వాటి వల్ల కలిగే నష్టాలను వివరించారు. సరైన పత్రాలు లేని 44 ద్విచక్ర వాహనాలు రెండు ఆటోలను అదుపులోకి తీసుకున్నారు. శాంతి భద్రతలు నేర నియంత్రణ లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు డిఎస్పి లక్ష్మీనారాయణ అన్నారు. కార్యక్రమంలో సిఐ రామారావు కురిచేడు దొనకొండ తాలూరు ఎస్ఐలు 35 మంది పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.