చీమకుర్తి పట్టణంలో శనివారం ఆర్టీసీ బస్ స్టాప్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. సంక్రాంతి సెలవులు ముగియడంతో తాము ఉద్యోగాలు , ఉపాధి చూపిన ప్రాంతాలకు తరలి వెళ్లేందుకు బాడీగా బస్ స్టాప్ కు తరలి రావడంతో ఆ ప్రాంగణం ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. రద్దీకి సరిపడినంత ఆర్టీసీ బస్సులు లేకపోవడం, సమయానికి బస్సులు రాకపోవడంతో గత్యంతరం లేక ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆర్టీసీ అధికారులు స్పందించి, బస్సుల సంఖ్యను పెంచవలసిన అవసరం ఎంతైనా ఉంది.