శ్రీ సత్య సాయి జిల్లా కదిరి మండలం గగనవారిపల్లెలో శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో గొర్రెల కాపరి సోమయ్య బాబు గొర్రెలు కాస్తుండగా ప్రమాదవశాత్తు గగనవారిపల్లి కొండకు నిప్పు అంటుకోవడంతో గొర్రెలు కాలిపోతాయి అన్న భయంతో గొర్రెలను పక్కకు తోలుతున్న సమయంలో సోమయ్య బాబుకు నిప్పంటుకోవడంతో తీవ్ర గాయాలవడంతో హుటాహుటిన మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.