కళ్యాణదుర్గం లోని అతి పవిత్రమైన శ్రీ అక్కమ్మ దేవాలయంలో సోమవారం మాఘమాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు అక్కమ్మ దేవతకు అర్చనలు, అభిషేకాలు, మహా మంగళ హారతి వంటి ప్రత్యేక పూజలు చేశారు. ఆయా పార్టీ నాయకులతోపాటు భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు తీర్చుకున్నారు. భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఆలయంతో పాటు పరిసరాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది.