సంగారెడ్డి: వసతి గృహ విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుంది : సంగారెడ్డి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్
వసతి గృహ విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని సంగారెడ్డి జిల్లా అదను కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. బీసీ విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం హాస్టల్స్ మరింత మెరుగుపరచడంలో కార్పొరేట్ సంస్థలు భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. మంగళవారం కిరిబి పరిశ్రమ సహకారం సిఎస్ఆర్ నిధులతో సంగారెడ్డి హాస్టల్ బాలుర బాలికల విద్యార్థులకు స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్లు గ్లాసులు స్కూల్ బ్యాగులు ట్రంకు బాక్సులు పంపిణీ చేశారు. కిర్బీ పరిశ్రమ సిఎస్ఆర్ నిధులతో సౌకర్యాలు కల్పనకు రావడం పట్ల ఆఫీసర్లు హర్షం వ్యక్తం చేశారు.