నేలకొండపల్లి: ఎరువులు,పురుగు మందుల విక్రయాల్లో నిబంధనలను ఉల్లఘింస్తే కఠిన చర్యలు
కూసుమంచిలో ఎరువులు, పురుగుమందుల దుకాణాలను కూసుమంచి డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు సరిత గురువారం తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఏడిఏ సరిత మాట్లాడుతూ ప్రతి డీలరు పిఓవైస్ మిషన్ ద్వారా మాత్రమే ఎరువుల అమ్మకాలను చేయాలని, లైసెన్సు,స్టాక్ బోర్డు, మరియు ధరల పట్టికను తప్పనిసరిగా ప్రదర్శించాలని సూచించారు. స్టాక్ బోర్డును రైతులుకి అర్థమయ్యేలా తెలుగులో ప్రదర్శించాలని సూచించారు. ఏ డీలర్ అయినా ఎమ్మార్పీ కంటే అధిక ధరకు విక్రయిస్తే వారిపై సంబంధిత చట్టాల ప్రకారం తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.