రాయదుర్గం: HLC కి నీరు బంద్ కావడంతో కణేకల్లు వద్ద రింగ్ బండ్ వేసి కాలువలో నీటిని నిల్వ చేసిన రైతులు
హెచ్ఎల్సీ కాలువకు తుంగభద్ర నీరు బంద్ కావడంతో కణేకల్లు చిక్కణ్ణేశ్వర వడియార్ చెరువు వద్ద కాలువ టన్నల్ వద్ద రింగ్ బండ్ వేసి రైతులు నీటిని నిలిపారు. గోనె సంచుల్లో మట్టి, ఇసుక నింపి కాలువలో నీటి ప్రవాహానికి అడ్డంగా వేశారు. ఆయకట్టు లో రబీ సీజన్ వరి సాగవుతోంది. ఈ నేపథ్యంలో పంటకు నీరు అవసరం ఉన్నందున నీటిని ఆపి పొదుపుగా వాడుకుంటున్నట్లు రైతులు తెలిపారు.