కుప్పం శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయంలో కార్తీక దీపోత్సవం సందర్భంగా రాత్రి 7 గంటల సమయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహిళలు దీపాలు వెలిగించి దీపారాధన చేశారు. కార్తీకదీపం సందర్భంగా ఉదయం నుంచి ఆలయానికి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు కార్తిక దీపోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.