కుల గణన చేపట్టాలని గూడూరు టవర్ క్లాక్ సెంటర్ వద్ద సీపీఐ నాయకులుధర్నా
Gudur, Tirupati | Nov 18, 2025 రాష్ట్రంలో జన గణనతో పాటు కులగణన చేపట్టాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. గూడూరు టవర్ క్లాక్ సెంటర్లో ఆ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు సీహెచ్. ప్రభాకర్ మాట్లాడుతూ.. దేశంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, మహిళలపై దాడులు మితిమీరిపోతున్నాయని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసనగా నినాదాలు చేశారు. సీపీఐ, బీఎస్పీ నాయకులు పాల్గొన్నారు.