ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో విశ్వకవి యోగివేమన జయంతిని పురస్కరించుకుని సోమవారం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యోగివేమన చిత్రపటానికి పూలమాల వేసి జిల్లా కలెక్టర్ రాజాబాబు, జాయింట్ కలెక్టర్ గోపాలక్రిష్ణలు నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. యోగివేమన తన పద్యం ద్వారా నీతిని సమాజానికి చాటి చెప్పారన్నారు.