ధర్మారం: పత్తిపాకలో విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలు, సమస్యపై స్పందించి తొలగించిన అధికారులు
ధర్మారం మండలం పత్తిపాక గ్రామంలో ఇండ్ల మధ్య ఉన్న చెట్ల కొమ్మలు ఈదురు గాలులకు విద్యుత్ వైర్లను తాకుతూ మంటలు చెలరేగుతున్నాయి. దీంతో బుధవారం మధ్యాహ్నం స్థానికులు ఈ సమస్యను ధర్మారం ఏఈ మహమ్మద్ ఖాసీం దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించారు. విద్యుత్ సిబ్బందిని గ్రామానికి పంపించి కరెంట్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించి సమస్యను పరిష్కరించారు.