జగ్గంపేట సర్కిల్ పరిధిలో ఉన్న కిర్లంపూడి, జగ్గంపేట,గండేపల్లిమండలాల మహిళా సంరక్షణ కార్యదర్శులకు జగ్గంపేట సిఐ వారికి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జగ్గంపేట సర్కిల్ ఆఫీస్ వద్ద గురువారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం మోటివేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వై ఆర్ కే శ్రీనివాస్ మాట్లాడుతూతమతమ గ్రామాలలోని మహిళా సోదరీ మణులు అందరూ మహిళలకు రక్షణ కవచంగా ఉన్న శక్తి యాప్ ను డౌన్లోడ్ మరియు రిజిస్ట్రేషన్ చేయించాలని అన్నారు.