పెద్దపప్పూరు మండలం చిన్న పప్పూరులో వెలిసి ఉన్న శ్రీ అశ్వర్థ నారాయణస్వామి క్షేత్రం లో అశ్వర్థ నారాయణస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాలికలు, విద్యార్థులు, యువతులు కోలాటం చేసి అందరినీ అలరించారు. సుమారు రెండు గంటలపాటు ఆలయ పరిసరాల్లో కోలాటం చేశారు. భక్తులు భారీగా తరలివచ్చి కోలాటాన్ని వీక్షించారు.