ఇల్లందకుంట: సిరిసేడు గ్రామంలో సిపి ఆదేశాల మేరకు ACP మాధవి ఆధ్వర్యంలో కార్డెన్ సర్చ్ సరైన పత్రాలు లేని 75 వాహనాల సీజీ చేసిన పోలీసులు
ఇల్లందకుంట: మండలం సిరిసెడ్ గ్రామంలో ఆదివారం ఉదయం పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో ఇంటింటి సోదాలు నిర్వహించారు. సరైన ధృవ పత్రాలు లేని 75 వాహనాలను సీజ్ చేశారు. నంబర్ ప్లేట్ లేని వాహనాలకు వారి రిజిస్ట్రేషన్ పత్రాలు పరిశీలించి వాటికి నంబర్ ప్లేట్లను పెట్టించారు. పోలీసులు ప్రజలతో వ్యక్తిగతమైన పరిచయాలు ఉంటే ప్రజలు ఏదైనా సమస్యలు వచ్చిన లేదా ఏదైన నేరపూరిత సమచారాన్ని వ్యక్తిగతం గా ఇస్తారని అలగే నేరాలను అదుపు చేయడానికి పోలీసులకు ప్రజల సహకారం కూడా అవసరమని , మైనర్లకు వెహికల్స్ ఇవ్వరాదని ఏసిపి మాధవి అన్నారు.