యువత డ్రగ్స్ బారిన పడకుండా కాపాడుకుందాం: కలెక్టర్ ఎస్పీ
Chittoor Urban, Chittoor | Nov 18, 2025
దేశ భవిష్యత్తుకు అవసరమైన యువత డ్రగ్స్ బారిన పడకుండా సంబంధిత శాఖలని సమన్వయంతో సమర్ధవంతంగా పనిచేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సమిత్ కుమార్ అన్నారు మంగళవారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ తుషార్ డ్యూటీ తో కలిసి నార్కోటి కమిటీ సమావేశం నిర్వహించారు సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశ భవిష్యత్తుకు అవసరమైన యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్నారు మాదకద్రవ్యాల సంబంధిత కార్యకలాపాలను నివారించడానికి ముందస్తు పర్యవేక్షణ మరియు అవగాహన కార్యక్రమాలు అవసరాన్ని నొక్కి చెప్పారు.