ఇల్లందు: అక్టోబర్ 7న పాలిస్తాన ప్రజలకు మద్దతుగా పాలిస్తాను సంఘీభావం ర్యాలీ ఇల్లెందులో సంఘం నాయకులు
అక్టోబర్ 7న పాలస్తీనా ప్రజలకు మద్దతుగా సంఘీభావ ర్యాలీని జయప్రదం చేయాలని కోరుతూ ఇల్లందులో ప్రచారం గత రెండు సంవత్సరాలుగా పాలస్తీనా పై ఇజ్రాయిల్ దాడులను నిరసిస్తూ, దాడులను వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తూ ఇల్లందులో ఇల్లందు పాలస్తీనా సంఘీభావ కమిటీ ఆధ్వర్యంలో అక్టోబర్ 7న నిర్వహించే ర్యాలీని జయప్రదం చేయాలని ఇల్లందు పాలస్తీనా సంఘీభావ కమిటీ కన్వీనర్ ఆవునూరి మధు ప్రజలని కోరారు. ఇల్లందు లోని గోవిందు సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా పాలస్తీనా ప్రజలపై, చిన్నపిల్లలు,మహిళలు, వృద్ధులని చూడకుండా ఇజ్రాయిల్ అత్యంత దుర్మార్గంగా దాడి చేస్తుంది అన్నారు