ములుగు: ఆచారాలు దెబ్బతినకుండా మేడారం వనదేవతల గద్దెలు ఏర్పాటు చేస్తాం: మంత్రి సీతక్క
Mulug, Mulugu | Sep 15, 2025 తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల ఆచారాలు దెబ్బతినకుండా అమ్మవార్ల గద్దెలను తీర్చి దిద్దుతామని మంత్రి సీతక్క అన్నారు. సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశంలో సీతక్క మాట్లాడారు.