అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని సీర్పి మరియు హనిమరెడ్డి పల్లి గ్రామాల్లోని సచివాలయాలను గురువారం ఎంపీడీవో లక్ష్మీనారాయణ డిప్యూటీ ఎంపీడీవో ఏకాంబరేశ్వరయ్యలు తనిఖీ చేశారు. సచివాలయాల్లో ఉద్యోగులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఎంపీడీవో సూచించారు. గ్రామ సచివాలయాల్లో బయోమెట్రిక్ అటెండెన్స్, ఈ కేవైసీ, కార్యాలయ రికార్డులను పరిశీలించి సమయపాలన పాటించాలని సూచించారు.