హుస్నాబాద్: అభివృద్ధి పనులకు అప్పులు చేశామని, నిలువ నీడ లేక సర్కారు బడిలో ఆశ్రయం ఉంటున్నామని మైసమ్మ వాగు తండా తాజా మాజీ సర్పంచ్ వెల్లడి
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మైసమ్మ వాగు తండా తాజా మాజీ సర్పంచ్ లావణ్య నిలువ నీడ లేక సర్కారు బడిలోనే ఆశ్రయం పొందుతోంది. 2019 లో బిఆర్ఎస్ నుండి సర్పంచ్ గా ఎన్నికైన లావణ్య బిల్లులు తర్వాత వస్తాయనే నమ్మకంతో అప్పులు చేసి మరీ గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టారు. తీరా బిల్లులు రాక అప్పుల భారం పెరగడంతో ఉన్న రెండు ఎకరాల భూమిని విక్రయించి కొన్ని అప్పులు తీర్చారు. అయినా మరికొన్ని అప్పులు తీరకపోగా, ఇంతలోనే నివాసం ఉంటున్న సొంత ఇల్లు కూడా కూలిపోయింది. దీంతో లావణ్య కుటుంబం సమీపంలోని కుందనవానపల్లి గ్రామంలో ఓ చిన్న ఇల్లు అద్దెకు తీసుకున్నారు. కానీ విద్యుత్ ఘాతంతో ఆ ఇంటి యజమాని తల్లి మర