ప్రభుత్వ ఆసుపత్రి, ఏ ఎం సి వార్డులో కరెంట్ వైర్లు కట్ చేసి, చోరీ చేసిన దొంగ అరెస్ట్ రెండో పట్టణ సీఐ శ్రీకాంత్ యాదవ్
Anantapur Urban, Anantapur | Nov 14, 2025
ఈనెల 10-11-2025 వ తేది రాత్రి సుమారు 10 pm గంటల సమయంలో అనంతపురం టౌన్, ప్రభుత్వ ఆసుపత్రి, AMC వార్డు లో కరెంట్ వైర్లు కట్ చేసి , కరెంట్ పోవడానికి కారణమైన వ్యక్తి పై GGH సూపరింటెండ్ కేఎల్ సుబ్రహ్మణ్యం ఇచ్చిన పిర్యాదు మేరకు కేస్ నమోదు చేసి దర్యాప్తు లో భాగంగా సదరు వైర్లను కట్ చేసి రోగులకు ఇబ్బంది, వైద్యుల విధులకు ఆటంకం కలిగించిన అనంతపురం టౌన్, స్టాలిన్ నగర్ కు చెందిన అనిల్ ను శుక్రవారం రాత్రి ఏడున్నర గంటల సమయంలో అరెస్ట్ చేశామని రెండో పట్టణ సీఐ శ్రీకాంత్ యాదవ్ మీడియాకు తెలిపారు.