అనంతపురం నగరంలోని రుద్రంపేటలో మంగళవారం ఉదయం ఆరున్నర గంటల సమయంలో కుటుంబ సమస్యలతో బాధపడుతూ గణేష్ అనే వ్యక్తి ఇంటిలోనే ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నం అక్కడికక్కడే మృతి. ఈ సంఘటనకు సంబంధించి నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పండుగ పూట ఈ విషాద ఘటన చోటు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని అత్యవసర విభాగం వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. గణేష్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.