కామారెడ్డి: రానున్న రెండు రోజులు భారీ వర్షాలకు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి :పట్టణంలో జిల్లా కలెక్టర్ అశిష్ సంగ్వాన్
జిల్లాలో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున  అధికారులు అప్రమత్తంగా ఉండి జిల్లాలో ధన, ప్రాణ నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని  జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ గురువారం సాయంత్రం అత్యవసరంగా అధికారులతో  నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్లో ఆదేశించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  రానున్న రెండు రోజులు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని  వాతావరణ శాఖ సూచనలు ఉన్నందున ఇటీవల జిల్లాలో సంభవించిన భారీ వర్షాల కురిసే అవకాశం ఉన్నందున ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.