కొరిశపాడు మండలంలో 87 మంది రైతులు పండ్ల సాగుకు ఎంపిక: ఏపీవో గాయత్రి లక్ష్మి
కొరిశపాడు మండలంలో ఉపాధి హామీ పథకం ద్వారా 87 మంది రైతులు పండ్ల సాగుకు ఎంపిక చేసినట్లు ఏపీవో గాయత్రీ లక్ష్మి సోమవారం తెలిపారు. మండలం మొత్తం మీద రావినూతల, కొరిశపాడు గ్రామాల రైతులు మాత్రమే సాగుకు సన్నద్ధమైనట్లు చెప్పారు. మిగిలిన గ్రామాల వారు వర్షాలు పడుతున్నందున గుంతలు తీసుకొని ఆయా పండ్ల మొక్కలు సాగు చేసుకోవాలని ఆమె తెలియజేశారు. పండ్ల సాగు తర్వాత ప్రభుత్వ ప్రోత్సాహం అందుతుందని గాయత్రి లక్ష్మీ పేర్కొన్నారు.