రాజేంద్రనగర్: యాచారంలో ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన వ్యవసాయ శాఖ అధికారిణి గీతారెడ్డి
ఎరువులు, విత్తనాలు లూజుగా విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని రంగారెడ్డి జిల్లా వ్యవసాయశాఖ అధికారి గీతారెడ్డి అన్నారు. శనివారం ఆమె యాచారం మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. వ్యవసాయశాఖ అనుమతి లేకుండా ఎరువులు, విత్తనాలు విక్రయిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు