భీమిలి: డి మార్ట్ వద్ద జీవీఎంసీ పైప్ లైన్ నుండి ఉవ్వెత్తున ఎగిసి పడుతూ వృధాగా పోతున్న మంచి నీరు
మధురవాడ డి మార్ట్ ఎదురుగా సర్వీస్ లైన్ లో మంచినీటి మెయిన్ పైపు నుండి త్రాగునీరు ఉవ్వెత్తున ఎగసి పడుతుంది .పైపును ముందు జంక్షన్ లో బ్లాక్ చెయ్యకుండానే ఎస్కేప్ హోల్ తెరచి వదిలి వేయటంతో మంచినీరు వృధాగా పోతుంది. మంచినీరు లభించక ఎంతో మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఉన్న నీటిని ఇలా నిర్లక్షంగా వ్యవహరించటం వల్ల నీరు వృధా అవుతుందని స్థానికులు తెలిపారు. జీవీఎంసీ మంచినీటి విభాగ సిబ్బంది తక్షణమే నీరు వృధాగా పోకుండా చూడాలని కోరుతున్నారు.