ములుగు: ఏటూరునాగారంలోని 3వ బ్రిడ్జి వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీ, ఇద్దరు యువకులకు విరిగిన కాళ్లు
Mulug, Mulugu | Sep 16, 2025 ఏటూరునాగారంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. 163 జాతీయ రహదారి 3వ బ్రిడ్జి వద్ద మంగళవారం సాయంత్రం ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు కాళ్లు విరిగిపోయాయని స్థానికులు తెలిపారు. కాగా, మరో బైక్ పై ఉన్న వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయన్నారు. 108 అంబులెన్స్ సహాయంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.