ఒంగోలు కలెక్టర్ క్యాంపు కార్యాలయం ఏర్పాటుచేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమంలో సోమవారం కలెక్టర్ రాజబాబు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ముఖ్యంగా రెవెన్యూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్ నిర్వహించామని కలెక్టర్ తెలిపారు. వచ్చిన అర్జీలు అన్నిటిని పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని కలెక్టర్ రాజాబాబు అన్నారు. మార్కాపురం జిల్లా ప్రాంత ప్రజలకు నేడు ఆ ప్రాంతంలోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు.