ప్రకాశం జిల్లా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ రావు సోమవారం తిరుమల లోని శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయానికి వెళ్ళిన ఆయన ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనంతరం నియోజకవర్గ ప్రజలు చల్లగా ఉండాలని శ్రీవారి ఆశీస్సులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు పేర్కొన్నారు.