పెడన మండలం లంకలకలవగుంట గ్రామంలో సంజీవని హెల్త్ క్యాంప్: డాక్టర్ వరప్రసాద్
Machilipatnam South, Krishna | Sep 25, 2025
లంకలకలవగుంటలో సంజీవని హెల్త్ క్యాంప్ స్తానిక పెడన మండలం లంకలకలవగుంట గ్రామంలో గురువారం మద్యాహ్నం రెండు గంటల సమయంలో సంజీవని హెల్త్ క్యాంప్ నిర్వహించారు. చేవేండ్ర ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఆధ్వర్యంలో డాక్టర్ వరప్రసాద్ వైద్య శిబిరాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన రోగులను పర్యవేక్షించి, అవసరమైన మందులను అందించారు. ఈ క్యాంప్ లో ఏఎన్ఎం జ్యోతి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు చురుకుగా పాల్గొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న కొంతమంది రోగులకు అక్కడే సెలైన్ ఏర్పాటు చేశారు.