నాగులుప్పలపాడు: డివైఎఫ్ఐ నెల్లూరు నగర నాయకుడు పెంచలయ్యను హత్య చేయడాన్ని నిరసిస్తూ నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరులో ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంగళవారం కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు వెంకటేశ్వర్లు, బసవ పున్నయ్య మాట్లాడుతూ.... డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాడుతున్నాడన్న అక్కస్సుతోనే పెంచలయ్యను దుండగులు కిరాతకంగా నెల్లూరులోని నడిరోడ్డుపై హత్య చేశారన్నారు. పెంచలేను హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.