వెయ్యేల చరిత్రకు సాక్షంగా.. ప్రకృతి అందాల నెలవుగా పర్యటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న కంగుందిలో 'తదేకం' ఆధ్వర్యంలో జనవరిలో బౌల్డరింగ్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు ఎమ్మెల్సీ శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం పేర్కొన్నారు. తదేకం ఆధ్వర్యంలో కంగుందిలో పర్యాటక అభివృద్ధి పనులను వారు పరిశీలించారు. కుప్పం ప్రాంతాన్ని టూరిజంగా అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా కృషి చేస్తున్నారన్నారు.