అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం గంగవరం గ్రామ సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదానికి గురైన కళ్యాణదుర్గం మండలం కురాకుల తోట గ్రామానికి చెందిన హనుమంతురాయుడు(48) కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందడం జరిగిందని స్టేషన్ ఎస్ఐ శివ సాయంత్రం పేర్కొన్నారు. విడపనకల్లు మండలం కొత్తకోట గ్రామానికి ఊరు జాతర కు వెళ్లి తిరిగి వస్తుండగా గంగవరం వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందాడని మృతుని భార్య లక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ పేర్కొన్నారు.