ఆంధ్రప్రదేశ్ దిశను మార్చే చారిత్రాత్మక విశాఖ CII సమ్మిట్ :తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్
Anantapur Urban, Anantapur | Nov 16, 2025
ఆంధ్రప్రదేశ్ రాష్టాన్ని పెట్టుబడుల హబ్ గా మార్చేందుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్ ఎంత వ్యూహాత్మకంగా శ్రమిస్తున్నారో నిరూపణగా విశాఖలో నిర్వహించిన CII భాగస్వామ్య సదస్సు నిలిచిందని అనంతపురము జిల్లా పార్టీ అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ మాట్లాడుతూ విశాఖ సదస్సు ద్వారా పెట్టుబడుల యుగానికి పునాది పడటమే కాదు, ఆంధ్రప్రదేశ్ పై గ్లోబల్ దృష్టిని మళ్లీ కేంద్రీకరించింది.