పాల్వంచ: ఎటువంటి ఆంక్షలు లేకుండా రైతు రుణమాఫీ చేయాలి... అఖిల భారత రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయలు ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని AIKMS రాష్ట్ర నాయకులు ఎస్కే ఉమర్,న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరావు,జిల్లా సహాయ కార్యదర్శి కుంజ కృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మంగళ వారం పాల్వంచ పట్టణంలో అఖిల భారత రైతు కూలి సంఘం(AIKMS)మండల కేంద్రంలో ధర్నా నిర్వహించి తహసిల్దార్ వివేక్ కు వినతిపత్రం అందించారు. ఎటువంటి షరతులు లేకుండా అందరికీ రుణమాఫీ చేయాలని లేని పక్షంలో రైతులకు పక్షం అండగా ఉండి ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరించారు