ఖమ్మం అర్బన్: తహసీల్దార్ ఫిర్యాదు మేరకు సీపీఎం కార్యకర్తపై కేసు నమోదు చేసిన రఘునాథపాలెం పోలీసులు
రఘునాధపాలెం పోలీసులు సిపిఎం కార్యకర్త సైదులుపై శనివారం కేసు నమోదు చేశారు.రఘునాథపాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మండల ఎమ్మార్వో లూధర్ విల్సన్ ఫిర్యాదు మేరకు సి.పి.ఎం పార్టీ టౌన్ కార్యకర్త అయిన సైదులుపై కేసు నమోదు చేశారు. సైదులు అనే అతను కొంతమంది ప్రజలను పువ్వాడ ఉదయ నగర్ కాలనీలోని గవర్నమెంట్ స్థలాలను అక్రమంగా ఆక్రమించుకోవాలని సోషల్ మీడియాలో పిలుపునిచ్చి రెచ్చగొట్టాడు. ఎమ్మార్వో ఫిర్యాదు మేరకు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు.