విజయనగరం జిల్లా రాజాంలో కొద్ది రోజులుగా మంచినీటి సరఫరా పూర్తిస్థాయిలో అందకపోవడంతో మహిళలు ఆదివారం రోడ్డెక్కారు. రాజాంలో ఎప్పటికప్పుడు పైప్ లైన్లు మరమ్మతులకు గురికావడంతో తరుచూ నీటి సరఫరా నిలిచిపోతోంది. ఈ నేపథ్యంలో విసిగిపోయిన మహిళలు స్థానిక బొబ్బిలి రోడ్డుకు అడ్డంగా నిలబడి వాహనాలకు ఆపివేశారు. అధికారులు, పాలకులు స్పందించి తాగునీటి సమస్య లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మహిళలకు నచ్చజెప్పి పంపించే ప్రయత్నం చేశారు. మహిళల నిరసనతో కొంతమేర ట్రాఫిక్ నిలిచిపోయింది.