జన్నారం: విద్యార్థులు ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి: జన్నారం మండల ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్ ఉమాశ్రీ
విద్యార్థులు ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని జన్నారం ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్ ఉమశ్రీ సూచించారు. మంగళవారం జన్నారం మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో మండల వైద్య సిబ్బంది విద్యార్థులకు ఆరోగ్య వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను పరీక్షించి అవసరమున్న వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. స్ట్రెస్ మేనేజ్మెంట్ పట్ల వివరించారు. విద్యార్థులు ఆరోగ్య జాగ్రత్తలను తప్పక పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సిబ్బంది రాంబాబు,సుభక్త,కల్పన ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.