ముధోల్: ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డిని బీజేపీ నాయకులు విమర్శించడం సరికాదని కుబీర్ మండల కాంగ్రెస్ నాయకులు అన్నారు.
Mudhole, Nirmal | Sep 16, 2025 ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డిని బీజేపీ నాయకులు విమర్శించడం సరికాదని కుబీర్ మండల కాంగ్రెస్ నాయకులు అన్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడుతూ.. 10ఏళ్ల పాటు నియోజకవర్గాన్ని పరుగులు పెట్టించిన నాయకుడిని విమర్శించే స్థాయి బీజేపీ నాయకులకు లేదన్నారు. పార్టీలకు అతీతంగా సహాయం చేసే మంచి మనసున్న మాజీ ఎమ్మెల్యేను విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని తీవ్రంగా హెచ్చరించారు.