హిమాయత్ నగర్: మా కార్యకర్తల మీద దాడి చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు : మాజీ మంత్రి కేటీఆర్
బీఆర్ఎస్ కార్యకర్త రాకేష్ పై కాంగ్రెస్ నాయకులు దాడి చేయడంతో విషయం తెలుసుకున్న కేటీఆర్ రెహ్మత్ నగర్ లోని రాకేష్ ఇంటికి శనివారం మధ్యాహ్నం వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లుగానే జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత నాది అని అన్నారు. మా కార్యకర్తల మీద దాడి చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని కేటీఆర్ అన్నారు.