ఖమ్మం అర్బన్: మహిళ మెడలో నుంచి గొలుసు దొంగతనానికి పాల్పడిన ఇద్దరు దొంగలు
ఖానాపురం హవేలీ పోలీసు స్టేషన్ పరిధిలో దొంగలు రెచ్చిపోయారు.హవేలీ సిఐ భానుప్రకాశ్ మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం... పంచాయతీరాజ్ ఆఫీస్ సబార్డినేట్ గా పని చేస్తున్న నున్న లత మమతా రోడ్ రాధాకృష్ణ నగర్ రోడ్ లో నివాసం ఉంటుంది.బుధవారం రాత్రి సమయంలో ఇంటికి వెళ్ళుచుండగా చీకటిలో ఒక ఇద్దరు వ్యక్తులు గుర్తు తెలియని వారు నిల్చుని ఉండి మెడలో నుంచి బలవంతంగా గొలుసు లాక్కెళ్లారు. అది తెగి సుమారుగా మూడు గ్రాముల బంగారపు గొలుసు దొంగిలించుకుని పోయారని ఫిర్యాదు చేశారు.బాధిత మహిళ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సిఐ తెలిపారు.