మార్కాపురం కలెక్టరేట్ కార్యాలయంలో వెలుగొండ ప్రాజెక్టుకు 2000 కోట్ల రూపాయల కేటాయించాలని అఖిల పార్టీ నాయకులు ధర్నా చేశారు. రాబోయే బడ్జెట్ సమావేశంలో వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో వినతి పత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు.