కేసుల సత్వర పరిష్కారానికి చక్కని వేదిక జాతీయ లోక్ అదాలత్ - జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు ఐపిఎస్ జాతీయ లోక్ అదాలత్ లో 3950 కేసులు పరిష్కారం చేయటంలో కృషి చేసిన పోలీస్ అధికారులను, సిబ్బందిని స్తానిక మచిలీపట్నం పొలీస్ పెరేడ్ గ్రైండ్ నందు గల జిల్లా ఎస్పీ కర్యాలయం నందు ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో ఎస్పి అభినందించారు. ఈ సందర్బంగా ఎస్పి మాట్లాడుతూ..రాజీమార్గమే రాజమార్గంగా ప్రజల యొక్క వ్యయ ప్రయాసలను తొలగించి, ఎంతోకాలంగా అపరిష్కృతంగా ఉన్న కేసులను పరిష్కరించడానికి ఈ జాతీయ లోక్ అదాలత్ చక్కని పరిష్కారమని ఆన్నారు. అలాగె కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అయన అన్నారు.