ఖమ్మం అర్బన్: ఇంటి వివాదంపై ఇరువర్గాల ఫిర్యాదుపై కేసులు నమోదు చేసిన ఖానాపురం హవేలీ పోలీసులు
ఖానాపురం హవేలీ పోలీసులు ఇంటి వివాదంపై రెండు కేసులు నమోదు చేశారు.ఖానాపురం హవేలీ సిఐ భానుప్రకాశ్ సోమవారం తెలిపిన వివరాల ప్రకారం... ఖమ్మం మధురానగర్ లో SK ఖలీల్ పాషా ఇల్లు కొనుగోలు చేసాడు.ఇల్లు విక్రయించిన వారు ఖాళీ చేయడం లేదనే విషయమై అడిగేందుకు ఆదివారం వెళ్లగా కార్తీక్ అనే వ్యక్తి తనపై దౌర్జన్యం చేసి చంపుతానని బెదిరించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసారు. అదే ఇంటి విషయంలో తమపై దౌర్జన్యం చేసి,తమను చంపుతామని బెదిరించిన షేక్ సోందుమియా,షేక్ ఖలీల్ తో పాటు మరికొందరిపై నర్వనేని నైమిషా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సిఐ భానుప్రకాశ్ తెలిపారు.