అనంతపురం నగర శివారులోని రూరల్ మండల పరిధిలో ఉన్న ఉప్పరపల్లి గ్రామ సమీపంలో ఉన్న ఆలయం వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఉప్పరపల్లి గ్రామానికి చెందిన శంకర నారాయణ అనే యువకుడితో పాటు మరో యువకుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. దీంతో వారిద్దరినీ అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. వారిలో గుర్తుతెలియని యువకుడి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.