వేములవాడ: పట్టణంలోని కల్లు కాంపౌండ్ సమీపంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
వేములవాడ పట్టణ పరిధి తిప్పాపూర్ బ్రిడ్జి వద్దగల కల్లు కాంపౌండ్ లో సుమారు 30 సంవత్సరాల వయసు గల గుర్తుతెలియని మగ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉన్నాడు. పొడవాటి జుట్టు మరియు గడ్డం కలిగి తెల్ల రంగు పూల చొక్కా మరియు లేత సిమెంట్ రంగు ప్యాంటు ధరించి ఉన్నాడు. అతని కుడి చేతి పై ప్రభ అనే పేరుతో పచ్చబొట్టు రాసి ఉంది కావున ఎవరికైనా వివరాలు తెలిస్తే వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో తెలియజేయగలరు.. CI Vemulavaada Town - 8712656413 SI Vemulawada Town - 8712580413..