అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా భారతీయ జనతా పార్టీ మహిళా మార్చే అధ్యక్షురాలు దగ్గుపాటి సౌభాగ్య మహిళా మోర్చా ప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు. ముగ్గుల పోటీల్లో వికసిత్ భారత్ థీమ్ ప్రత్యేక ప్రాధాన్యతతో పోటీలు నిర్వహించి బహుమతులను పంపిణీ చేశారు.