మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహం నిరుపయోగంగా మారింది. దీంతో ఆ సాంఘిక కార్యకలాపాలకు అడ్డంగా మారడంతో స్థానికులు వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. కోట్ల రూపాయలతో ఖర్చుపెట్టి భవనాలను ఏర్పాటు చేశారు. వాటిని బాలికలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.